హైదరాబాద్: తెలంగాణలోని విద్యా సంస్థలకు దసరా సెలవులు ఖరారయ్యాయి. అక్టోబర్ 10 తేదీ నుంచి అక్టోబర్ 22, 2026 వరకు మొత్తం 13 రోజుల పాటు పాఠశాలలకు సెలవులు ఉండనున్నాయి. అక్టోబర్ 23వ తేదీన పాఠశాలలు తిరిగి ప్రారంభం అవుతాయి.
రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలలకు ఈ సెలవులు వర్తించనున్నాయి. దసరా పండుగకు ముందు విద్యార్థులకు నిర్వహించిన సమ్మేటివ్ అసెస్మెంట్-1 (SA-1) పరీక్షలు అక్టోబర్ 1 నుంచి 9 వరకు జరగనున్నాయి. పరీక్షలు పూర్తైన వెంటనే దసరా సెలవులు ప్రారంభం కానున్నాయి.
ఇది కూడా చదవండి – PM Kisan 24th Installment: రూ.2,000 రావాలంటే ఈ 3 విషయాలు చూడండి
ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా అక్టోబర్ 10 నుంచి సెలవులు ప్రారంభం కానున్నాయి. అయితే జూనియర్ కాలేజీలకు అక్టోబర్ 21 వరకు మాత్రమే సెలవులు ఉంటాయి. అక్టోబర్ 22న కాలేజీలు తిరిగి ప్రారంభమవుతాయి.
బతుకమ్మ, దసరా పండుగల సమయంలోనే సెలవులు
ఈసారి దసరా సెలవులు బతుకమ్మ, విజయదశమి పండుగల సమయంలోనే రావడంతో విద్యార్థులకు వరుసగా సెలవులు లభించనున్నాయి. అక్టోబర్ 18న సద్దుల బతుకమ్మ, అక్టోబర్ 19న మహర్నవమి, అక్టోబర్ 20న విజయదశమి పండుగలు జరగనున్నాయి.
దీంతో పండుగల కోసం ఎంత ఊర్లకు వెళ్లే కుటుంబాలకు ఈ సెలవులు అనుకూలంగా ఉండనున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్లో నివసించే కుటుంబాలు ఇప్పటికే ప్రయాణ ఏర్పాట్లు చేసుకుంటున్నాయి.
పండుగ రద్దీకి రవాణా శాఖ ఏర్పాట్లు
దసరా సెలవుల నేపథ్యంలో రైళ్లు, బస్సుల్లో ప్రయాణికుల ఎక్కువ రద్దీ పెరిగే అవకాశం ఉంది. హైదరాబాద్ నుండి తెలంగాణలోని వివిధ జిల్లాలతో పాటు ఏపీ ప్రజలు తమ స్వగ్రామాలకు వెళ్లే వారి సంఖ్య కూడా పెరగనుంది.
పండుగ రద్దీకి అనుగుణంగా అదనపు బస్సులు నడిపే ఏర్పాట్లపై ఆర్టీసీ దృష్టి పెట్టనుంది. రైల్వేలోనూ దసరా సమయంలో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి – కుట్టు మిషన్ల కోసం పోటెత్తిన దరఖాస్తులు.. నియోజకవర్గానికి వెయ్యి మందికే ఛాన్స్!
సెలవుల్లో తరగతులు నిర్వహించొద్దు
దసరా సెలవుల సమయంలో విద్యార్థులకు ప్రత్యేక తరగతులు, ఆన్లైన్ క్లాసులు నిర్వహించకుండా పాఠశాలలు సెలవులను పాటించాలని విద్యాశాఖ సూచించింది.
SA-1 పరీక్షలు పూర్తైన తర్వాత విద్యార్థులకు వరుసగా సెలవులు రావడంతో అక్టోబర్ 10 నుంచి దసరా సెలవులు ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 23న పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతాయి.

Comments
No comments yet. Be the first to comment.