కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) పథకం ద్వారా అర్హత ఉన్న రైతులకు ఏడాదికి రూ.6,000 ఆర్థిక సాయం అందిస్తుంది. ఈ మొత్తాన్ని మూడు విడతల్లో, ఒక్కో విడతలో రూ.2,000 చొప్పున నేరుగా బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తారు. 2026 జూన్ 20న 23వ విడత నిధులను అర్హత కలిగిన రైతుల బ్యాంకు ఖాతాలలో జమ చేసింది. దీంతో ఇప్పుడు తదుపరి విడతలో రూ.2,000 ఎప్పుడు జమ అవుతుందనే ఆసక్తి రైతుల్లో నెలకొంది.
24వ విడత కోసం ఎదురుచూస్తున్న వారు తమ ఖాతా వివరాల్లో ఏమైనా సమస్యలు ఉన్నాయో ముందుగానే చెక్ చేసుకోవడం మంచిది. ముఖ్యంగా e-KYC, Land Seeding, Aadhaar–Bank/DBT వివరాలు కరెక్ట్ గా ఉన్నాయో చూడాలి. వీటిలో ఏవైనా వివరాలు పెండింగ్‌లో ఉంటే చెల్లింపు ప్రక్రియలో సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది.
ఈ పథకాన్ని 2026–27 నుంచి 2030–31 వరకు కొనసాగించేందుకు కేంద్ర మంత్రివర్గం రూ.3.15 లక్షల కోట్ల ఆర్థిక కేటాయింపును ఆమోదించింది. అర్హత ఉన్న రైతు కుటుంబాలకు ఏడాదికి రూ.6,000 మూడు సమాన విడతల్లో అందుతుంది.
PM-KISAN 24వ విడత వివరాలు
| వివరాలు | ప్రస్తుత సమాచారం |
|---|---|
| ప్రస్తుత విడత | 24వ విడత |
| పథకం | PM-KISAN |
| విడత మొత్తం | అర్హత ఉన్న రైతుకు రూ.2,000 |
| చివరి విడత | 23వ విడత – 20 జూన్ 2026 |
| 24వ విడత విడుదల తేదీ | అధికారికంగా ప్రకటించాల్సి ఉంది |
| అధికారిక వెబ్‌సైట్ | pmkisan.gov.in |
రూ.2,000 రావాలంటే ఈ 3 విషయాలు చెక్ చేయండి
1. e-KYC పూర్తయిందో లేదో చూడండి
- పీఎం కిసాన్ లో దైన రైతులు e-KYC ప్రక్రియను తప్పకుండా పూర్తి చేయాలి. ఇది పూర్తయిందా లేదా అనేది అధికారిక పోర్టల్ ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు.
- ప్రస్తుతం OTP ద్వారా e-KYC చేసుకునే అవకాశం ఉంది. అవసరమైతే బయోమెట్రిక్ విధానంలో కూడా ప్రక్రియను పూర్తి చేయవచ్చు.
- స్టేటస్‌లో e-KYC పెండింగ్‌లో కనిపిస్తే, తదుపరి విడతకు ముందే పూర్తి చేసుకోవాలి.
2. Land Seeding వివరాలు సరిగ్గా ఉన్నాయా?
- రైతుల భూమికి సంబంధించిన వివరాలు కూడా సంబంధిత రికార్డుల్లో ధృవీకరించబడాలి. ఈ వివరాల నమోదు, వెరిఫికేషన్ ప్రక్రియ రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా జరుగుతుంది.
- అందువల్ల మీ ఖాతాలో Land Seeding వివరాలు సరిగ్గా ఉన్నాయో ఒకసారి చూసుకోవాలి.
- భూమి వివరాల్లో తప్పులు లేదా పెండింగ్ సమస్య కనిపిస్తే సంబంధిత అధికారులను సంప్రదించి సరి చేసుకుని ఎటువంటి సమస్య లేకుండా పొందవచ్చు.
3. Aadhaar–Bank Linking, DBT వివరాలు చెక్ చేయండి
- అర్హత ఉన్న రైతులకు నిధులు DBT విధానం ద్వారా బ్యాంక్ ఖాతాకు బదిలీ అవుతాయి. కాబట్టి ఆధార్ అనుసంధానం, DBT కు సంబంధించిన బ్యాంక్ వివరాలు సరిగ్గా ఉండటం అవసరం.
- ఇటీవల ఖాతా మార్చిన వారు లేదా ఆధార్ సీడింగ్‌పై సందేహం ఉన్నవారు తమ బ్యాంక్ శాఖలో వివరాలను సరిచూసుకోవాలి.
PM-KISAN Status ఎలా చెక్ చేయాలి?
మీ వివరాలు తెలుసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్‌లోని “Know Your Status” ఆప్షన్ ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు. స్టేటస్ లో రిజిస్ట్రేషన్, e-KYC, చెల్లింపులు, అర్హతకు సంబంధించిన సమాచారం కనిపిస్తుంది. ఏదైనా వివరాలు పెండింగ్‌లో ఉన్నా లేదా సమస్యగా చూపించినా, దానికి అనుగుణంగా చర్య తీసుకోవచ్చు.

23వ విడతలో ఎంతమందికి డబ్బు వచ్చింది?
2026 జూన్ 20న విడుదల చేసిన 23వ విడతలో సుమారు 9.44 కోట్ల మంది రైతులకు రూ.18,880 కోట్లకు పైగా DBT ద్వారా అందించినట్లు ప్రభుత్వం తెలిపింది.
అయితే 24వ విడతకు సంబంధించిన ఖచ్చితమైన తేదీని ప్రభుత్వం అధికారికంగా ప్రకటన చేయలేదు తాజా సమాచారం, చెల్లింపు వివరాల కోసం ప్రభుత్వ పోర్టల్‌లో వచ్చే సమాచారాన్ని పరిశీలించండి.
రైతులు ఇప్పుడు ఏం చేయాలి?
- PM Kisan 24th Installment కోసం ఎదురుచూస్తున్న రైతులు తమ వివరాలను ఇప్పుడే ఒకసారి పరిశీలించుకోవచ్చు.
- e-KYC, Land Seeding, Aadhaar–Bank/DBTలో ఏదైనా పెండింగ్‌లో ఉంటే సంబంధిత ప్రక్రియను పూర్తి చేయండి. వివరాల్లో సమస్య ఉంటే బ్యాంక్, సేవా కేంద్రం లేదా సంబంధిత అధికారులను సంప్రదించి సరిచేసుకోవడం మంచిది.
- ముందుగానే ఈ వివరాలను పరిశీలించుకోవడం వల్ల చెల్లింపు సమయంలో ఎదురయ్యే సమస్యలను తగ్గించుకునే అవకాశం ఉంటుంది.

Comments
No comments yet. Be the first to comment.