సమాజంలో ఎంతమంది ప్రతిభావంతులైన అమ్మాయిలు ఉన్నప్పటికీ. కేవలం ఆర్థిక ఇబ్బందుల వల్లే చాలామంది ఇంటర్మీడియట్ తర్వాత తమ చదువును పూర్తి చేయలేకపోతున్నారు. అటువంటి అమ్మాయిలకు ‘సంతూర్ ఉమెన్స్ స్కాలర్షిప్ (Santoor Women’s Scholarship)’ ప్రోగ్రామ్ మంచి అవకాశంగా నిలుస్తోంది. ఆర్థికంగా వెనుకబడిన మహిళ విద్యార్థులు కూడా ఉన్నత విద్యను అభ్యసించాలనె ఉద్దేశంతో విప్రో కన్స్యూమర్ కేర్, విప్రో కేర్స్ (Wipro Consumer Care & Wipro Cares) కలసి సంయుక్తంగా ఈ స్కాలర్షిప్ ప్రోగ్రాం ద్వారా అర్హత కలిగిన విద్యార్థినులకు ఆర్థిక సహాయం అందిస్తారు. ఈ స్కాలర్షిప్ కార్యక్రమం 2016 నుంచి కొనసాగుతోంది.
2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించిన సంతూర్ స్కాలర్షిప్కు అర్హత ఉన్న విద్యార్థినులు ఆన్లైన్ ద్వారా అక్టోబర్ 15, 2026 లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో ఎంపికైన విద్యార్థినులకు డిగ్రీ పూర్తయ్యే వరకు ప్రతి సంవత్సరం రూ.30,000 వరకు ఆర్థిక సాయం అందుతుంది. అయితే దరఖాస్తు చేసే ముందు అర్హతలు, అవసరమైన పత్రాలు, చివరి తేదీ వంటి వివరాలను తప్పనిసరిగా పరిశీలించుకోవాలి.
ఇది కూడా చదవండి – Dussehra Holidays: తెలంగాణలో దసరా సెలవులు.. అక్టోబర్ 10 నుంచి 13 రోజులు
స్కాలర్షిప్ గురించిన ముఖ్యమైన వివరాలు
| వివరాలు | సమాచారం |
|---|---|
| స్కాలర్షిప్ పేరు | Santoor Scholarship Programme 2026–27 |
| సంస్థలు | Wipro Consumer Care & Wipro Cares |
| స్కాలర్షిప్ మొత్తం | సంవత్సరానికి ₹30,000 |
| చదువు | ఫుల్‌టైమ్ అండర్గ్రాడ్యుయేట్ / డిగ్రీ కోర్సు |
| కోర్సు వ్యవధి | కనీసం 3 సంవత్సరాలు |
| అర్హత రాష్ట్రాలు | ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర |
| చివరి తేదీ | 15 అక్టోబర్ 2026 |
| దరఖాస్తు విధానం | ఆన్లైన్ |
ఈ స్కాలర్షిప్ కోసం అర్హత సాధించే వారు ఎవరు?
ఈ సంతూర్ స్కాలర్షిప్ నిజమైన లబ్ధిదారులకు చేరాలనే ఉద్దేశంతో విప్రో సంస్థ కొన్ని ప్రత్యేక నిబంధనలను విధించింది:
- లింగం: కేవలం విద్యార్థినులు (మహిళలు) మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
- పాఠశాల నేపథ్యం: అభ్యర్థిని ఖచ్చితంగా స్థానిక ప్రభుత్వ పాఠశాల నుండి 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే 2025–26 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాల లేదా ప్రభుత్వ జూనియర్ కాలేజీ నుండి ఇంటర్మీడియట్ (12వ తరగతి) పాస్ అయి ఉండాలి.
- ప్రస్తుత చదువు: 2026–27 విద్యా సంవత్సరంలో ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీలో ఫుల్-టైమ్ అండర్ గ్రాడ్యుయేట్ (Degree/UG – కనీసం 3 సంవత్సరాల కోర్సు) మొదటి సంవత్సరంలో చేరి ఉండాలి.
- కోర్సుల ప్రాధాన్యత: ప్రొఫెషనల్ కోర్సులు చేసేవారు కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే హ్యుమానిటీస్, లిబరల్ ఆర్ట్స్, మరియు సైన్స్ కోర్సులు చదివే విద్యార్థినులకు, ముఖ్యంగా వెనుకబడిన జిల్లాల వారికి మొదటి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.
- మినహాయింపు: విప్రో, సంతూర్ లేదా బడ్డీ4స్టడీ (Buddy4Study) సంస్థల్లో పనిచేసే ఉద్యోగుల పిల్లలు దీనికి అర్హులు కారు.
దరఖాస్తుకు కావలసిన డాక్యుమెంట్లు
ఆన్లైన్ ఫారమ్ నింపడానికి కూర్చునే ముందు, క్రింది పత్రాలను స్కాన్ చేసి మీ మొబైల్ లేదా కంప్యూటర్ లో సిద్ధంగా ఉంచుకోండి:
- పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో.
- 10వ తరగతి మార్కుల జాబితా (Class 10 Marksheet).
- 12వ తరగతి/ఇంటర్మీడియట్ మార్కుల జాబితా (Class 12 Marksheet).
- ప్రస్తుత డిగ్రీ కాలేజీ అడ్మిషన్ రశీదు లేదా కాలేజీ ఐడీ.
- విద్యార్థిని పేరిట ఉన్న బ్యాంక్ పాస్‌బుక్ మొదటి పేజీ.
- ఆధార్ కార్డు (Aadhaar Card).
ఇది కూడా చదవండి – PM Kisan 24th Installment: రూ.2,000 రావాలంటే ఈ 3 విషయాలు చూడండి
దరఖాస్తు చేసుకునే సులువైన విధానం
ఈ స్కాలర్షిప్ దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్ ద్వారానే జరుగుతుంది. దీనికి ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

- స్టెప్ 1: మొదటగా అధికారిక వెబ్సైట్ Santoor Scholarships లేదా వారి అప్లికేషన్ పార్ట్నర్ పోర్టల్ Buddy4Study ని సందర్శించండి.
- స్టెప్ 2: మీ ఈమెయిల్ ఐడీ లేదా మొబైల్ నంబర్ ఉపయోగించి అకౌంట్ రిజిస్టర్ చేసుకోండి.
- స్టెప్ 3: లాగిన్ అయిన తర్వాత ‘Santoor Scholarship Programme 2026–27‘ లింక్‌పై క్లిక్ చేయండి.
- స్టెప్ 4: అప్లికేషన్ ఫారమ్‌లో మీ వ్యక్తిగత, విద్యా మరియు బ్యాంక్ ఖాతా వివరాలను తప్పులు లేకుండా పూరించండి.
- స్టెప్ 5: పైన పేర్కొన్న అన్ని డాక్యుమెంట్లను స్పష్టంగా అప్లోడ్ చేయండి.
- స్టెప్ 6: ఫారమ్‌ను ఒకటికి రెండుసార్లు సరిచూసుకుని, అక్టోబర్ 15, 2026 లోపు Submit బటన్ నొక్కండి.
సందేహాల కోసం హెల్ప్‌లైన్ నంబర్లు
దరఖాస్తు చేసుకునేటప్పుడు మీకు ఏవైనా సాంకేతిక సమస్యలు లేదా సందేహాలు ఉంటే, సహాయం కోసం విప్రో కేర్స్ వారి అధికారిక నంబర్లను సంప్రదించవచ్చు: 7411654395 / 7411654394. ఇక్కడ మీకు తెలుగులోనే పూర్తి సహాయం అందుతుంది.
మీకు తెలిసిన విద్యార్థినులు, స్నేహితులు లేదా బంధువులలో ఎవరైనా ఈ అర్హతలు కలిగి ఉంటే, వెంటనే వారికి ఈ సమాచారాన్ని షేర్ చేయండి. మీరు చేసే ఒక చిన్న షేర్ ఒక అమ్మాయి జీవితాన్ని మార్చేయవచ్చు!
Comments
No comments yet. Be the first to comment.