చదువులో ప్రతిభావంతులైన విద్యార్థులను మరింత ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ (NMMS Scholarship) పథకాన్ని అమలు చేస్తోంది. ప్రతిభ ఉన్నప్పటికీని ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువులో ఇబ్బందులు ఎదుర్కొనే విద్యార్థులకు కొంత మేరకు ఉపయోగకరంగా ఉంటుంది. 8వ తరగతిలో ఎంపికైన విద్యార్థులకు 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఆర్థిక సాయం అందుతుంది. ఇందులో నాలుగేళ్లలో మొత్తం రూ.48,000 వరకు స్కాలర్షిప్ పొందే అవకాశం ఉంది.
ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్న అర్హులైన విద్యార్థులు NMMS స్కాలర్షిప్ ప్రయోజనాన్ని పొందడానికి నిర్వహించే అర్హత పరీక్షకు అక్టోబర్ 12, 2026 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. అర్హత ఉన్నటువంటి విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.
ఇది కూడా చదవండి – Santoor Women’s Scholarship 2026–27 – నిరుపేద విద్యార్థినులకు వరం.. ఏడాదికి ₹30,000 సాయం!
ముఖ్యమైన తేదీలు
నెలకు రూ.1,000.. నాలుగేళ్లలో రూ.48,000
NMMS స్కాలర్షిప్కు ఎంపికైన విద్యార్థులకు నెలకు రూ.1,000 చొప్పున ఆర్థిక సాయం అందుతుంది. అంటే ఏడాదికి రూ.12,000 చొప్పున లభిస్తుంది. 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు నాలుగేళ్ల పాటు ఈ స్కాలర్షిప్ కొనసాగుతుంది.
అంటే నాలుగేళ్లలో మొత్తం సాయం ఇలా ఉంటుంది:
- 1 సంవత్సరానికి రూ.12,000
- 2 సంవత్సరాలకు రూ.24,000
- 3 సంవత్సరాలకు రూ.36,000
- 4 సంవత్సరాలకు రూ.48,000
ఈ మొత్తాన్ని ప్రభుత్వం డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (DBT) విధానంలో విద్యార్థి బ్యాంక్ ఖాతాలో జమ చేస్తుంది.
ప్రయోజనం పొందడానికి ఉండాల్సిన అర్హతలు..
NMMS స్కాలర్షిప్ పరీక్షకు దరఖాస్తు చేసుకునే విద్యార్థులు కొన్ని నిర్దిష్ట అర్హతలను కలిగి ఉండాలి.
- పాఠశాల: విద్యార్థి ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ, మున్సిపల్, జెడ్పీ, ఎయిడెడ్ లేదా హాస్టల్ సౌకర్యం లేని మోడల్ స్కూళ్లలో 8వ తరగతి చదువుతూ ఉండాలి. ప్రైవేట్ పాఠశాలలు, కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ విద్యాలయాలు, అలాగే వసతి సౌకర్యం ఉన్న మోడల్ స్కూళ్ల విద్యార్థులు ఈ స్కాలర్షిప్కు అర్హులు కారు.
- మార్కులు: 7వ తరగతిలో కనీసం 55 శాతం మార్కులు సాధించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు కనీస మార్కుల అర్హత 50 శాతంగా ఉంది.
- ఆదాయ పరిమితి: విద్యార్థి కుటుంబ వార్షిక ఆదాయం రూ.3.50 లక్షల లోపు ఉండాలి.
పరీక్ష విధానం.
NMMS స్కాలర్షిప్ ఎంపిక కోసం రాత పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో రెండు పేపర్లు ఉంటాయి.
- Mental Ability Test (MAT): రీజనింగ్, తార్కిక ఆలోచన, విశ్లేషణాత్మక సామర్థ్యానికి సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. ఈ పేపర్ 90 మార్కులకు ఉంటుంది.
- Scholastic Aptitude Test (SAT): 7వ, 8వ తరగతి స్థాయి సిలబస్ ఆధారంగా మ్యాథ్స్, సైన్స్, సోషల్ సైన్స్ సబ్జెక్టుల నుంచి 90 మార్కులకు ప్రశ్నలు అడుగుతారు.
దరఖాస్తు ప్రక్రియ.

అర్హత ఉన్న విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరీక్షల విభాగం అధికారిక వెబ్సైట్ bse.ap.gov.in ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లికేషన్ ప్రక్రియలో అవసరమైతే పాఠశాల ప్రధానోపాధ్యాయుల (HM) సహాయం తీసుకోవచ్చు.
ఇది కూడా చదవండి – Dussehra Holidays: తెలంగాణలో దసరా సెలవులు.. అక్టోబర్ 10 నుంచి 13 రోజులు
కావలసిన పత్రాలు
- 7వ తరగతి మార్కుల వివరాలు
- కుల ధృవీకరణ పత్రం (వర్తిస్తే)
- ఆదాయ ధృవీకరణ పత్రం
- ఆధార్ వివరాలు
- బ్యాంక్ ఖాతా వివరాలు
కేంద్ర ప్రభుత్వం విద్యలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఆర్థిక భరోసా కల్పిస్తూ వారి చదువు కొనసాగించేందుకు NMMS స్కాలర్షిప్ ఆర్థికంగా ప్రయోజనం పొందేలా ఉంటుంది.
- మరింత సమాచారం కోసం అధికారిక వెబ్సైట్ bse.ap.gov.in
- NMMS అప్లికేషన్ చేయడానికి క్లిక్ చేయండి → Click Here

Comments
No comments yet. Be the first to comment.