ఆధార్ కార్డులో పేరు మార్చడం లేదా తప్పులను సరిచేయడం ఇకపై మరింత జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్ లో పేరు మార్పులు, సవరణలకు సంబంధించి కొత్త స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (Standard Operating Procedure) ను అమల్లోకి తీసుకొచ్చింది. ఈ నిబంధనలు సెప్టెంబర్ 18, 2026 నుంచి అమల్లోకి వచ్చాయి.
ఈ కొత్త విధానంలో పేరు మార్పును ఒకే రకంగా కాకుండా.. దరఖాస్తుదారులు చేసే మార్పుల స్వభావాన్ని బట్టి వేర్వేరు ధ్రువపత్రాలు మరియు అఫిడవిట్లను తప్పనిసరి చేస్తూ ఈ కొత్త మార్గదర్శకాలను జారీ చేశారు.
ఇది కూడా చదవండి – NMMS Scholarship 2026: 8వ తరగతి విద్యార్థులకు నాలుగేళ్లలో రూ.48,000 సాయం ఇలా అప్లై చేయండి
చిన్నపాటి మార్పులకు ఒక గుర్తింపు పత్రం.
పేరులో చిన్నపాటి తప్పులు (Minor Changes) ఉంటే వాటిని సరిచేయడం కోసం ప్రక్రియ కొంత సులభంగా ఉంటుంది. స్పెల్లింగ్ తప్పులు సరిచేయడం, ఇనిషియల్స్ను పూర్తి పేరుగా మార్చడం, పేరు క్రమాన్ని మార్చడం, మిడిల్ నేమ్‌ను జోడించడం లేదా తొలగించడం వంటి మార్పులు ఈ కేటగిరీలోకి వస్తాయి.
ఉదాహరణకు.. ‘T.R.D. Prasad’ పేరును ‘Tadi Rama Durga Prasad’ గా మార్చడం వంటి సవరణలను చిన్నపాటి మార్పులుగా పరిగణించవచ్చు. ఇలాంటి సందర్భాల్లో సరైన వివరాలు ఉన్న చెల్లుబాటు అయ్యే గుర్తింపు పత్రం (Proof of Identity – PoI) సమర్పించాల్సి ఉంటుంది.
పెళ్లి లేదా విడాకుల తర్వాత పేరు మార్పు.
వివాహం లేదా విడాకుల తర్వాత పేరు లేదా ఇంటిపేరు మార్చుకోవాలి అనుకునేవారికి ప్రత్యేక నిబంధనలు వర్తిస్తాయి. ఈ సందర్భంలో మార్పు వైవాహిక స్థితి కారణంగా జరుగుతోందని నిర్ధారించే పత్రాలను సమర్పించాలి.
UIDAI సూచించిన Annexure D అఫిడవిట్ లేదా వర్తించే సందర్భంలో రిజిస్టర్డ్ మ్యారేజ్ సర్టిఫికెట్ వంటి పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది.
డేటా ఎంట్రీ తప్పులైతే..
ఆధార్ నమోదు సమయంలో సిబ్బంది చేసిన పొరపాట్లు (Data Entry Errors) లేదా ఒక భాష నుంచి మరో భాషలోకి వివరాలను మార్చే సమయంలో ఏర్పడిన తప్పుల కోసం కూడా ప్రత్యేక విధానం ఉంది.
మీ అసలు పత్రాల్లో ఉన్న పేరు, ఆధార్‌లో నమోదైన పేరుతో సరిపోకపోతే.. పరిస్థితిని బట్టి సరైన గుర్తింపు పత్రంతో పాటు అఫిడవిట్ వంటి అదనపు ఆధారాలను సమర్పించాల్సి రావచ్చు.
పూర్తిగా కొత్త పేరు పెట్టుకోవాలంటే..
ఒక వ్యక్తి తన పేరును పూర్తిగా (Complete Name Change) మార్చుకోవాలనుకుంటే సాధారణ పేరు సవరణగా పరిగణించరు. ఇలాంటి సందర్భాల్లో అదనపు ధృవీకరణ అవసరం.
పూర్తి పేరు మార్పు కోసం కేంద్ర గెజిట్ నోటిఫికేషన్ (Central Gazette Notification) కీలకమైన పత్రంగా ఉంటుంది. అవసరమైన సందర్భంలో వార్తాపత్రిక ప్రకటన, గుర్తింపు పత్రం వంటి ఇతర ఆధారాలను కూడా సమర్పించాల్సి ఉంటుంది.
ఇది కూడా చదవండి – Santoor Women’s Scholarship 2026–27 – నిరుపేద విద్యార్థినులకు వరం.. ఏడాదికి ₹30,000 సాయం!
ఆన్లైన్లో పేరు మార్చుకోవచ్చా?
ఆధార్ కార్డులో పేరు మార్పు లేదా సవరణ కోసం ప్రస్తుతం myAadhaar పోర్టల్‌లో నేరుగా ఆన్లైన్లో అప్డేట్ చేసుకునే అవకాశం లేదని తాజా మార్గదర్శకాలకు సంబంధించిన నివేదికలు పేర్కొంటున్నాయి. పేరు మార్చుకోవాలనుకునే వారు అవసరమైన పత్రాలతో సమీపంలోని ఆధార్ సేవా కేంద్రాన్ని సందర్శించి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
మీ పేరు మార్పు ఏ కేటగిరీలోకి వస్తుందో బట్టి అవసరమైన గుర్తింపు పత్రం, అఫిడవిట్, వివాహ ధృవీకరణ పత్రం లేదా గెజిట్ నోటిఫికేషన్ వంటి ఆధారాలను సమర్పించాల్సి రావచ్చు.
పత్రాల ధృవీకరణపై UIDAI దృష్టి
కొత్త విధానంలో పత్రాల ప్రామాణికత కు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. ముఖ్యంగా అఫిడవిట్లు, గెజిట్ నోటిఫికేషన్లు వంటి పత్రాలను సమర్పించే సందర్భాల్లో వాటి చెల్లుబాటును అధికారులు పరిశీలించిన తర్వాతే సవరణ ప్రక్రియ ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది.
అందుకే ఆధార్‌లో పేరు మార్పు చేయాలనుకునే వారు ముందుగా తమ మార్పు ఏ కేటగిరీలోకి వస్తుందో తెలుసుకుని, దానికి అవసరమైన పత్రాలను ముందుగానే సిద్ధం చేసుకోవడం మంచిది.

Comments
No comments yet. Be the first to comment.